ప్రస్తుతం రాష్టంలో రాజకీయ రంగులతో.. నిండుతున్న సమయములో.. ఈ NOTA సినిమా రావటం.. కొంత ప్రాముఖ్యత సంతరించుకుంది.. అయితే ఈ సినిమా... “భరత్ అనే నేను” సినిమాలాగే.. మొదలయ్యి... ముక్యంగా తమిళ రాజకీయ.. రంగుల్లలో మునిగి తేలుతుంది.. ఈ సినిమా.. రెగ్యులర్ విజయ్ దేవరకొండ సినిమాల అనిపించదు.. ఎందుకంటే... విజయ్ దేవరకొండ.. మరో ఇద్దరు క్యారక్టర్ ఆర్టిస్ట్లు అయిన రెండు కొండల మద్య నలిగి పోయాడు అనిపించింది ఈ సినిమాలో... ఆ రెండు కొండలు...... సత్యరాజ్ .. నాసర్.. వీరు ఇద్దరు విజయ్ తో కలిసి మొత్తం కథని మోసినారు. ఇది తమిళ సినిమా అవ్వటం వల్ల.. తెలుగులో డబ్బ్ చేసినట్టు వుండటం వాల్ల... తమిళ...వాసన చాల సీన్స్..లో గుప్పు మంటూ... బాగావస్తుంది. సినిమా కథ విషయానికి వస్తే... అక్రమ ఆస్తుల కేసులో జైలు శిక్షను ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి వినోద్న్ (నాసర్) తన కుమారుడు వరుణ్ (విజయ్ దేవరకొండ) తిరిగి వచ్చే వరకు తాత్కాలిక సి.ఎమ్ అయ్యే అంశం.. ఆ తర్వాత... అతను ఎలాంటి .. మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు అనేది. రాజకీయ రంగు నిడిన దృశ్యాలు ఈ సినిమాకి బలాలు. అది తప్ప హీరొయిన్..కమెడియన్.. అంటూ ఎక్కువ ఉహించి సినిమాకి వెళ్ళకండి.. ఒక సారి చూడవచ్చు.. ముఖ్యంగా.. ఇప్పుడు రాజకీయ వేడి కూడా పెరిగింది కాబట్టి. శ్రీ.కో.