సినిమా ఫక్కీలో కిటికీ తొలగించి,
సహాయంగా చోరులు తాడుని మలచి,
గ్యాలరీలోపలికి దిగి కళాఖండాలు దోచి,
మ్యూజియంలోనే వజ్రవైఢూర్యాలని హాంఫట్ చేచి,
పారిపోయిటా ఆ టక్కరి దొంగలు. శ్రీ.కో.
హైదరాబాద్లోని నిజాం మ్యూజియంలోని విలువైన వస్తువులు చోరీకి గురి అయ్యాయి. పురానీహవేలీ మసరత్‌మహల్‌లోని నిజాం మ్యూజియంలో దొంగతనం ఘటన జరిగింది. ఎంతో పథకం వేసి దొంగలు అక్కడి భద్రతా సిబ్బంది కళ్లుగప్పి లోపలికి చొరబడి వజ్ర వైఢూర్యాలతో పొదిగిన వస్తువుల్ని అపహరించారు. పోలీసులు రంగంలోకి దిగి అన్నికోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు. చోరీ చేసిన ఘటనలో ముగ్గురు పాల్గొన్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. గ్యాలరీ పక్కనే ఉన్న సీసీ కెమెరాను పని చేయకుండా చేసి చోరీకి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. నిజాం మ్యూజియాన్ని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సందర్శించారు. ఆయన వెంట దక్షిణ మండలం అదనపు డీసీపీ గౌస్‌మోహినుద్దీన్, మీర్‌చౌక్ ఏసీపీ ఆనంద్ తదితర పోలీసుల అధికారులు ఉన్నారు.