కొద్దిమంది సినిమా డైరెక్టర్లు, కొత్తవారితో సినిమా తీసిన కూడా ...చాలాబాగా తీస్తారు... అలా జంద్యాల గారు తీసిన సినిమానే... నాలుగు స్తంభాలాట. ఈ సినిమా జంధ్యాల దర్శకత్వంలో, నరేష్, ప్రదీప్, పూర్ణిమ, తులసి ముఖ్యపాత్రల్లో నటించగా నవతా కృష్ణంరాజు నిర్మించిన 1982 నాటి చలనచిత్రం. నలుగురు యువతీయువకుల జీవితంతో ప్రేమ, పెళ్ళిళ్ళతో జీవితం ఆడుకున్న ఆటగా ఈ కథను రాసుకున్నారు జంధ్యాల. భారమైన ప్రేమకథలో సినిమాల్లో అంతగా అనుభవం లేని హీరోహీరోయిన్లతో నటింపజేసి జంధ్యాల విజయం సాధించారు. హిందీలో ఈ సినిమాను సంజయ్ దత్, అశోక్ కుమార్, పద్మినీ కొల్హాపురి ముఖ్యపాత్రల్లో బేకరార్ అన్న పేరుతో పునర్నిర్మించారు. ఈ సినిమాలో సుత్తి వీరభద్రరావు, సుత్తి వేలు చేసే హాస్యం చాలా ప్రాచుర్యం పొంది, సుత్తి అన్న పదాన్ని తెలుగు నాట ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది. ఆ సినిమా నుంచి వేలు, వీరభద్రరావుల పేర్లకు సుత్తి అనేది ఇంటిపేరు అయ్యింది. సినిమా 1982లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. సినిమాలోని చినుకులా రాలి పాట చాలా ప్రాచుర్యం పొందింది. సినిమాలోని సుత్తి హాస్యం అద్భుతమైన విజయం సాధించింది. అవతలివారికి ఆసక్తి లేకున్నా మాట్లాడుతూపోవడాన్ని సూచిస్తూ ఇప్పటికీ తెలుగువారి నుడికారంలో చేరిపోయింది. ఇప్పుడు మీరు సుత్తి కొట్టకు.. అనే మాట ఎక్కడైనా వింటే ...అది ఈ సినిమా నుండి మొదలైందని తెలుసుకోండి...అలాగే ఇప్పటి వరకు ఈ సినిమా చూడకుంటే తప్పక చూడండి. శ్రీ.కో.