ప్రియుడి మోజులో అప్పుడు,
ఆలోచించేను ఎన్నో తప్పుడు,
అంతా అయిపోయి ఇక ఇప్పుడు,
ఎంత ఏడ్చినా ఆపైవాడు ఒప్పడు.శ్రీ.కో
ప్రియుడి మోజులో పడి భర్తను కిరాతకంగా హతమార్చిన నాగర్ కర్నూల్ స్వాతి బెయిల్‌పై విడుదలయ్యింది. 8 నెలల తర్వాత ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. మహబూబ్‌నగర్ జైలు నుంచి విడుదల చేశారు. అయితే ఆమెను తీసుకెళ్లడానికి కుటుంబసభ్యులు నిరాకరించడంతో.. ఆమెను స్టేట్ హోంకు తరలించారు. ఇద్దరు వ్యక్తుల జామీను (పూచీకత్తు) అవసరం ఉండగా.. ఎవరూ ముందుకు రాక ఆమె జైలులోనే ఉండాల్సి వచ్చింది. కాగా, బుధ వారం నాగర్‌కర్నూల్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వగా శుక్రవారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్ జిల్లా జైలుకు, కోర్టు నుంచి ఉత్తర్వులు అందాయి. దీంతో ఆమెను సాయంత్రం జైలు నుంచి విడుదల చేశారు.