ఒక ఫ్యాక్టరీకి చెందిన గమ్మత్తు గోదాములపై దాడులు,
అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా యొక్క గుట్టు రట్టుకి దారులు,
నవీ ముంబాయి లో 37 కోట్ల విలువ చేసే కిక్ఇచ్హే మత్తులు,
మలేసియా డ్రగ్ మాఫియా పనేమో అని అంటున్న అధికారులు.
ఇంటెలిజెన్స్‌కు చెందిన నేర పరిశోధకులు ఒక పెద్ద అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు. అధికారుల వివరాల ప్రకారం రాయిగఢ్ ,నవీ ముంబాయి లో 37 కోట్ల విలువ చేసే 265 కిలోల నిషేధించిన కేటమైన్, మెటంఫెటమైన్ డ్రగ్స్‌ను గుర్తించిందని వీరంతా తూర్పు ఆసియా ప్రాంతానికి చెందిన పేరుమోసిన అంతర్జాతీయ ముఠా సభ్యులని వారు తెలిపారు. డిఆర్‌ఐ అధికారులు శుక్రవారం రోజు రాయిగఢ్ లోని రసయాని,తలోజ లో ఒక రసాయన ఫ్యాక్టరీకి చెందిన గోదాములపై దాడులు చేయగా 253 కిలోల కేటమైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 12 కేజీల మెటంఫెటమైన్‌ను నవీ ముంబాయిలో కోపర్ ఖైరానేలో తయారు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. వీటిని సాధారణంగా 'డేట్ రేప్ డ్రగ్స్ఞ్ అని పిలుస్తారు. ఇవి ఇండియా, విదేశాలలో జరిగే రేవ్ పార్టీలలో చాల ప్రసిద్ది చెందినవని, ఈ డ్రగ్స్ రాకెట్ మలేషియా కేంద్రంగా నడుస్తోందని డిఆర్‌ఐ అధికారులు తెలిపారు.వీరంతా ఒక సిండికేట్‌గా ఏర్పడి ముంబాయికి దగ్గరలో మారుమూల ప్రాంతాలలో బోగస్ డాక్యుమెంట్లతో కంపెనీలు ఏర్పాటుచేసి, గోదాములను అద్దెకు తీసుకొని ఆ స్ట్టాక్‌ను ఆక్కడ దిగుమతి చేసుకొని ఆ తరువాత వారికి కావలసిన ప్రదేశాలకు చేరవేస్తారు. డిఆర్‌ఐ అధికారుల సమాచారం ప్రకారం సీజ్ చేసిన కేటమైన్ డ్రగ్‌ను రసయానిలో ప్లాంట్‌లో తయారు చేసి ఆ తయారైన ఉత్పత్తిని 'లాండ్రీ డిటర్జెంట్ పౌడర్ఞ్ పేరిట దానిని చేరవేస్తారు. పట్టు బడ్డ మలేసియా డ్రగ్ మాఫియాకు చెందిన ఏడుగురు నిందితులను వారికి ఎవరెవరితో సంబంధాలన్నాయో, ఈ మాఫియా ఎక్కడెక్కడ విస్తరించిందో డిఆర్‌ఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.