ముచ్చెర్ల అరుణ ఒక భారతీయ సినీ నటి. తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలలో పలు చిత్రాలలో నటించింది. పదేళ్ళకు పైగా సినిమా కెరీర్ లో సుమారు 70 చిత్రాలకు పైగా నటించింది. 1981లో ఈవిడ తొలి తెలుగు చిత్రం సీతాకోకచిలుక ఉత్తమ జాతీయ చిత్రంగా బంగారు నెమలి పురస్కారాన్ని అందుకున్నది. మ్యూజిక్ మరియు డ్యాన్స్ అకాడమీలో ఈమెను చూసిన దర్శకుడు భారతీరాజా సినిమాలో నటించమని అడిగాడు. మొదట్లో తటపటాయించినా తర్వాత ఆ అవకాశాన్ని వదులుకోలేదు. ఆ సినిమా సీతాకోక చిలుక. ఈ సినిమా మంచి విజయం సాధించింది. శ్రీ.కో.