మౌన పోరాటం ఫేం హీరో గా చాల మంది తెలుగువారికీ పరిచయం వున్న వ్యక్తి వినోద్ కుమార్, ఇతను ఒక ప్రముఖ సినీ నటుడు. ఎక్కువగా తెలుగు సినిమాలలో నటించాడు. ఇంకా తమిళ, కన్నడ, మలయాళ సినిమాలలో నటించాడు. అతని మొదటి చిత్రం 1985లో విడుదలైన కన్నడ చిత్రం తవరు మనే. తెలుగులో మొట్టమొదటి చిత్రం రామోజీ రావునిర్మించగా 1989 లో విడుదలైన మౌన పోరాటం. మామగారు, కర్తవ్యం, భారత్ బంద్ లాంటి సినిమాలు అతనికి కథానాయకుడిగా మంచి పేరు తెచ్చిన చిత్రాలు. 1991 లో మామగారు సినిమాకు గాను ఉత్తమ సహాయనటుడిగా నంది అవార్డు వచ్చింది.శ్రీ.కో.