" మాయలోడు " మన మనసులను నవ్వించి...కవ్వించి...మాయ చేసే ఒక తెలుగు సినిమా. ఇది ఎస్వీ.కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన రెండవ చిత్రం. తన తొలి చిత్రం, మరియు రెండవచిత్రంలో కూడా హీరోహీరోయిన్లు రాజేంద్రప్రసాద్,సౌందర్య కావటం విశేషం. ఈ రెండు చిత్రాలకు నిర్మాత తన మిత్రుడు కె.అచ్చిరెడ్డి. ఈచిత్రం తరువాత యస్.వి.కృష్ణారెడ్డి, రాజేంద్రప్రసాద్ ల కాంభినేషన్లో మళ్ళీ మరో సినిమా రాలేదు. నంబర్ వన్ పొజిషన్లోకి వస్తున్న నటి సౌందర్యని కమెడియన్ బాబూమోహన్ తో జత కట్టించి 'చినుకు చినుకు అందెలతో 'అనే వానపాటలో నటింపజేశారు దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి. తరువాత ఇదే పాటను 1994లో అనే సినిమాలో కమెడియన్ ఆలీ, సౌందర్య లతో కూడా తీశారు. కుటుంబసమేతంగా చూడదగిన సెంటిమెంట్ తో కూడిన మంచి హాస్యకథాచిత్రమిది. ఈ చిత్రంలోని పాటలు అత్యంత ప్రేక్షకాదరణ పొందాయి. ఈ చిత్రం విడుదలై ఘన విజయం సాధించి చాలా కేంద్రాలలో 100 రోజులు, కొన్ని కేంద్రాలలో 175 రోజులు ప్రదర్శించబడింది. హైదరాబాద్ శ్రీనివాస థియేటర్ లో రోజూ నాలుగు ఆటల చొప్పున 252 లు ప్రదర్శించబడి రాజేంద్రప్రసాద్ నటించిన చిత్రాలలో అత్యధిక రోజులు ప్రదర్శించబడిన చిత్రంగా నిలచింది. ఈచిత్రానికి 1993 సంవత్సరానికి కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రంగా నంది అవార్డు లభించింది.
ఆకాష్ ఆడియో ద్వారా విడుదలైనఈ చిత్రంలోని పాటలు........... నీ మాయలోడిని నేనే నీ మాయలేడిని నేనే - గూడూరు విశ్వనాథ శాస్త్రి...........చినుకు చినుకు అందెలతో చిటపట చిరుసవ్వడితో – జొన్నవిత్తుల. మనీషా ఫిలింస్ పతాకంపై వచ్చిన ఈచిత్రంలో నటులు..... రాజేంద్రప్రసాద్, సౌందర్య, పద్మనాభం, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాబు మోహన్, గుండు హనుమంతరావు, ఆలీ,నిర్మలమ్మ....తదితరులు నటించారు. కథ,స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం యస్.వి. కృష్ణారెడ్డి. నిర్మాత కె.అచ్చిరెడ్డి
..కొన్ని నిముషాలు మంచిగా నవ్వుకోవాలని మీరు అనుకుంటే..ఈ సినిమా తప్పక చుడండి.. శ్రీ.కో.