మేరీ కోమ్ తన సత్తా ఏంటో చూపెట్టింది

Update: 2018-11-27 10:05 GMT

మల్లి ఒకసారి మన మేరీ కోమ్ తన సత్తా ఏంటో చూపెట్టింది... అయితే...ఏ సంవత్సరంలో, మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో మేరీ కోమ్ తన మొదటి బంగారు పతకాన్ని సాధించిందో మీకు తెలుసా! ఆవిడా తన మొదటి బంగారు పతకాన్ని 2002లో సాధించింది. అయితే న్యూఢిల్లీలోని 2018 మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో మణిపూర్ నుంచి మన  MC మేరీ కోమ్ చారిత్రాత్మక ఆరవ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఫైనల్లో, ఆమె KD జాదవ్ ఇండోర్ స్టేడియంలో 48 కిలోల విభాగంలో  ఉక్రెయిన్ యొక్క హన్నా ఓఖోటను ఓడించింది. ప్రస్తుతం ఛాంపియన్షిప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బాక్సర్గా మేరీ కోమ్ గుర్తింపు పొందారు, ఆమె 2002 లో మొదటిసారిగా గెలుపొందిన సరియైన 16 ఏళ్ల తర్వాత బంగారు పతకాన్ని సాధించింది. ఆమె 2002, 2005, 2006, 2008 మరియు 2010 లో కూడా బంగారు పతకం సాధించింది విజేతగా నిలిచింది. శ్రీ.కో.

Similar News