కొత్త కొత్త కథలు దొరకడం,
సినిమా ప్రేక్షకులకు నచ్చడం,
చాలా కొత్త కథనాలు నడవడం,
కొత్తదనం మరి ఎక్కువైతే పోవడం. శ్రీ.కో.
కొత్త కథలు దొరకడం చాల కష్టం అని అనుకుంటారు, అయితే కథ ఎలా ఉన్నా సినిమా ప్రేక్షకులకు నచ్చడం, నచ్చక పోవడం అనేది ఈ రోజుల్లో చాలావరుకు స్క్రీప్లే మీద ఆధారపడి ఉంటుంది. ‘మను' లాంటి సినిమాలకు స్క్రీప్లే చాల చాల ముఖ్యం. కాని ఈ సినిమా యొక్క స్క్రీన్ ప్లే విషయానికి వస్తే మాత్రం ఇది రొటీన్ సినిమాలతో పోలిస్తే డిఫరెంట్గా ఉంది. కాని ఈ డిఫరెన్స్ బాగా మరీ ఎక్కువై అదే సినిమాకు పెద్ద మైనస్‌గా మారిందేమో అని పిస్తుంది. అతి సర్వత్ర వర్జయతే, అని పెద్దవాళ్ళు చెప్పినట్టు... ‘మను' సినిమా విషయంలోని స్క్రీన్ ప్లే విషయంలో అదే జరిగింది. ప్రేక్షకుల ఓపికకి కొలమానం ఎంత అని తెలుసుకునే స్థాయిలో కథనం స్లోగా నడవడం జరిగింది. మోత్తానికి కొత్తదనం కొంచెం ఎక్కవై ప్రేక్షకులకు అందనత ఎత్తుకి ఎగిరిపోయింది.