కొన్ని సినిమాలు కలకాలం అలా నిలిచిపోతాయి..అలా నిలిచిపోయిన మరో చిత్రమే.. మన వూరి పాండవులు .మన వూరి పాండవులు బాపు దర్శకత్వంలో, ముళ్ళపూడి వెంకటరమణ రచయితగా కృష్ణంరాజు, మురళీమోహన్, చిరంజీవి, ప్రసాద్ బాబు, రావుగోపాలరావు ప్రధానపాత్రల్లో నటించిన 1978 నాటి తెలుగు చలనచిత్రం. ఈ సినిమా మహాభారతానికి ఆధునిక కథనం. మొదట ఈ సినిమాను పుట్టణ్ణ కణగాల్ కన్నడలో పడువారళ్ళి పాండవరు పేరుతో తీశాడు. బాపు ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో సంజీవ్ కుమార్, మిథున్ చక్రవర్తి మొదలైన వారితో హమ్ పాంచ్ పేరుతో పునఃసృష్టించాడు. శ్రీ.కో.