కొన్ని పాటలు .. మన మనసుని ఎక్కడికో తీసుకుపోతాయి...అలాగే ఆ పాటలోని భావంలోని అందం, మనని ముగ్దులని చేస్తాయి. అలాంటి పాటే.. ఈ మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై పాట
పల్లవి :
మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై
మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము
మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము
చరణం: 1
ఆశలు తీరని ఆవేశములో...ఆశయాలలో....ఆవేదనలో...
చీకటి మూసిన ఏకాంతములో.....
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము
చరణం: 2
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు....నీ కోసమే కన్నీరు నించుటకు
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము
చరణం: 3
చెలిమియె కరువై.. వలపే అరుదై
చెదిరిన హృదయమే శిలయై పోగా...
నీ వ్యధ తెలిసీ నీడగ నిలిచే...
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము.
మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము
ఈ పాటని విని భావాన్ని అర్ధం చేసుకుంటే దాని లోతు తెలుస్తుంది. శ్రీ.కో.