ఏవో అతీతశక్తులు వస్తాయని,
చేయాలనుకున్నారు అపరాధము,
ఈ మూఢనమ్మకాలు పోగొట్టకుంటే,
బలి అని చేస్తారు ఇలా నరమేధము. శ్రీ.కో
సంపూర్ణ చంద్ర గ్రహణం రోజున కృష్ణాజిల్లాలో క్షుద్రపూజల ఘటన తీవ్ర కలకలం రేపింది. నూజివీడు మండలం యనమదల కొందరు మంత్రగాళ్లు క్షుద్రపూజలకు సిద్ధమయ్యారు. వంద సంవత్సరాలకు ఓ సారి వచ్చే ఇలాంటి రోజున నరబడి ఇస్తే అతీత శక్తులు వస్తాయంటూ ఓ యువకుడిని బలిచ్చేందుకు గ్రామ పొలిమేర్లలోకి తీసుకొచ్చారు. పొలాల్లోకి వచ్చిన తరువాత పరిస్దితి తెలుసుకున్న యువకుడు చాకచక్యంగా మంత్రగాళ్ల నుంచి తప్పించుకున్నాడు.