కొన్ని సినిమాలు వాటి కథ బాగావున్న, ఎన్నో అవార్డ్లు వచ్చిన కూడా ధియేటర్లలో విడుదలకి చాల ఇబ్బంది పడతాయి, అలాంటి సినిమానె.... కొమరంభీమ్. ఈ సినిమా 2010 లో విడుదలైన తెలుగు చిత్రం. అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో గిరిజన పోరాట యోధుడు కొమరం భీమ్ జోవితం ఆధారంగా నిర్మించిన చిత్రం. భూపాల్ రెడ్డి ప్రధాన పాత్రను పోషించాడు. ఈచిత్రం నిర్మాణానంతరం దాదాపు 20 సంవత్సరాలకు విడుదలయ్యింది. విడుదలకు ముందే ఈ చిత్రం ఉత్తమ దర్శకత్వానికి మరియు ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా రెండు నంది పురస్కారములను సాధించింది. శ్రీ.కో.