రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోకుండా దీక్షలని,
2019లో మళ్లీ అధికారంలోకి రావాలని,
ఇదంతా బాబు కావాలని చేస్తున్నారని,
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా ఆరోపించారని,
శ్రీకాకుళంలో బీజేపీ పార్లమెంటరీ సమావేశం వార్త. శ్రీ.కో
2019లో మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని చంద్రబాబు దీక్షలు చేస్తున్నారని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ విమర్శించారు. ఆదివారం శ్రీకాకుళంలో బీజేపీ పార్లమెంటరీ స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రజలను, రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోకుండా సీఎం చంద్రబాబు ఎన్నికల గురించి ఆలోచిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేరు మార్చి రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. దేశాభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ కష్టపడుతున్నారని కన్నా లక్ష్మినారాయణ కొనియాడారు.