ఆకలి రాజ్యం సినిమా ఒక సన్సేశనల్ సక్సెస్ ఆరోజుల్లో పొందింది... ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కే .బాలచందర్ గారు... బాలచందర్ గారి అద్బుత సినిమాల్లో ఇది ఒక సినిమా అని చెప్పవచ్చు... ఈ సినిమా సంగీతం...ఎం.ఎస్.విశ్వనాథన ఇచ్చారు... హీరో హీరొయిన్ గా.. కమల్ హసన్, శ్రీదేవి. బాలచందర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తమిళ్, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరించినప్పటికీ తమిళ వెర్షన్ “వరుమైయిన్ నీరం శివప్పు” రెండు నెలలు ముందుగా 1980నవంబర్ 6న విడుదల చేశారు కమలహాసన్ తమిళ వెర్షన్ లో సుబ్రహ్మణ్య భారతియార్ కవితలనువినియోగించుకోగా తెలుగు వెర్షన్ లో శ్రీశ్రీ సాహిత్యాన్ని వినియోగించారు. ఈ చిత్రం కొన్ని కేంద్రాల్లో ఈ శతదినోత్సవం చేసుకోగా కొన్ని చోట్ల 150 రోజులు కూడా నడిచింది. ఆ కాలం నాటి నిరిద్యోగ పరిస్థితులను బాగా చూపించారు... ఇప్పటివరకు చూడని వారు తప్పక చూడాల్సిన సినిమా ఇది. శ్రీ.కో.