తెలుగుతనం తో నిండిన సినిమాలు దర్శకత్వం వహించటములో కే విశ్వనాధ్ గారిది ఒక ప్రత్యెకమైన శైలి. అలా తీసిన ఒక సినిమా ...సప్తపది, 1981లో విడుదలైన విశ్వనాథుడి సినిమా. ఇది నృత్యం ప్రధానాంశంగా వచ్చిన సినిమా. అంతకుముందు విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం అనే సంగీతప్రధాన చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమా మంచి అంచనాలతో విడుదలయ్యింది. శంకరాభరణం సినిమా అంత హిట్ కాకున్నా ఎంతోమంది ప్రేక్షకుల మన్ననలు పొందింది ఈ సప్తపది. శ్రీ.కో.