ఇరాన్‌తో వ్యాపారం చేస్తుంటే మాత్రం,
అమెరికాతో వ్యాపారం చేయలేరట,
పెద్దన్న డోనాల్డ్ గట్టిగా చెప్పినాడట,
మాట దాటితే వాత పెడతవా ఎందన్న. శ్రీ.కో
ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలకు, సంస్థలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి హెచ్చరిక చేశారు. ''ఇరాన్‌తో వ్యాపారం చేస్తుంటే అమెరికాతో వ్యాపారం చేయలేరు'' అని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి అమెరికా మేలో వైదొలగినప్పుడు తిరిగి విధించిన ఆంక్షల్లో కొన్ని భారత కాలమానం ప్రకారం మంగళవారం అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు ట్రంప్ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వును జారీ చేశారు