ఇన్ఫోసిస్ అనే కంపెనీ ఎన్ని దేశాలలో

Update: 2018-11-02 11:25 GMT

ఇన్ఫోసిస్ అనే కంపెనీ పేరు వినని వారు చాల తక్కువ మంది వుంటారు... ఈ ఇన్ఫోసిస్ ఎన్ని దేశాలలో వుందో మీకు తెలుసా!  ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ క్లుప్తంగా ఇన్ఫోసిస్ భారతదేశంలో పేరొందిన బహుళజాతి సాఫ్టువేరు సంస్థ. సమాచార సాంకేతికతసేవలు అందించే ఈ సంస్థ ప్రధాన కార్యాలయం భారతదేశంలోని బెంగుళూరులో ఉంది. ఇది భారతదేశంలోని అతి పెద్ద ఐటి కంపెనీల్లో ఒకటి. నవంబరు 9, 2009 నాటికి 105,453 మంది నిపుణులను కలిగి ఉంది (అనుబంధ సంస్థల వారితో కలిపి). దీని కార్యాలయాలు 22 దేశాలలో ఉన్నాయి. దీనికి భారతదేశంలో 9 అభివృద్ధి కేంద్రాలు మరియు ఇతర దేశాల్లో 34 కార్యాలయాలు ఉన్నాయి. చైనా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, కెనడా మరియు జపాన్లలో కూడా అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి. ఎన్.ఆర్. నారాయణ మూర్తి ఈ కంపెనీ వ్యవస్థాపకుల్లో ముఖ్యులు. ఎంతో మంది యువత ...ఈ కంపనీలో ఉద్యోగం చెయ్యడానికి ఉత్సాహం చూపెడతారు. శ్రీ.కో.

Similar News