హమ్మింగ్ బర్డ్ రూటే వేరు!

Update: 2018-11-24 14:45 GMT

హమ్మింగ్ పక్షి లేదా హమ్మింగ్ బర్డ్ ఒక రకమైన పక్షి. ఇది ప్రపంచంలోనే అతి చిన్న పక్షిగా రికార్డులకెక్కింది. అయితే ఈ హమ్మింగ్ బర్డ్ సెకనుకు ఎన్ని సార్లు తన రెక్కలు కొడుతుందో మీకు తెలుసా! హమ్మింగ్ బర్డ్ సెకనుకు 90 సార్లు నుండి దాదాపు..200 వంతున రెక్కలు టపటపలాడిస్తుందట, అంటే నిమిషానికి దాదాపు 5 వేల సార్లు అన్నమాట. అలాగే..రెక్కల్ని ఆడించేప్పుడు వచ్చే శ్రావ్యమైన శబ్దం వల్లే దానికి ఈ 'హమ్మింగ్ బర్డ్' అనే పేరొచ్చిందట. వెనక్కి కూడా ఎగిరే సత్తా వీటికుంది. ఈ పక్షులు గంటకు 54 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలవట. శ్రీ.కో.

Similar News