భారతదేశంలో తరచూ వరదలకు గురయ్యే రాష్ట్రం ఏదో మీకు తెలుసా! అతి ఎక్కువగా వరదలకు గురయ్యే రాష్ట్రం అస్సాం. కొందరు అస్సాం "అసమ" లేదా "అస్సమ" అనే సంస్కృత పదము యొక్క ఆధారం అని భావిస్తారు. ఈ పదము పర్వతమయమైన ఈ ప్రాంతము యొక్క వర్ణనకు కచ్చితంగా సరిపోతుంది. మరికొందరు ఈ పదము అస్సాం ప్రాంతాన్ని 600 సంవత్సరాల పాటు పరిపాలించిన అహోంలకు సంబంధించినదని భావిస్తారు. 1228కి పూర్వము ఈ పదాన్ని ఉపయోగించిన ఆధారాలు లేకపోవడము, చారిత్రక గంథాలు అహోంలను అసాంలని కూడా పేర్కొనడం ఈ వాదానికి కొంత బలాన్ని ఇస్తున్నాయి...శ్రీ.కో.