గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అకౌంట్లో 2వేల 500కోట్లు వచ్చిచేరనున్నాయి. 2015లో కంపెనీ కేటాయించిన 3లక్షల 53వేల 939 నియంత్రిత షేర్లను ఇప్పుడు సుందర్ అకౌంట్‌కి బదలాయించింది. ఇప్పుడు వీటి విలువ 380 మిలియన్ డాలర్లకు చేరింది. మన ఇండియన్ కరెన్సీలో ఇది 2వేల 500కోట్లు. అయితే ఈ షేర్లను నగదుగా మార్చుకునే అవకాశం సుందర్ పిచాయ్‌కి లభించనుంది. ఓ కంపెనీ ఉన్నతాధికారిగా ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ దక్కించుకుని సుందర్ పిచాయ్ రికార్డు సృష్టించారు.