కరుణానిధి యొక్క ఆరోగ్య పరిస్థితి,
ఇప్పుడు చేరుకుంటుంది విషమస్థితి,
ఆందోళనలో అభిమానుల మనోస్థితి,
ఎమవుతుందో తెలియని ప్రస్తుతస్థితి. శ్రీ.కో
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఆయన్ను శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత హుటాహుటిన నగరంలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులు, పెద్దఎత్తున డీఎంకే కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు తరలివచ్చారు. అర్ధరాత్రి దాటాక 1.15గంటల ప్రాంతంలో స్టాలిన్, అళగిరి, ఎ.రాజా, కనిమొళి, దురైమురుగన్ మరోసారి గోపాలపురంలోని కరుణ నివాసానికి చేరుకున్నారు. వారితో పాటు కావేరి ఆసుపత్రి వైద్యుల బృందం అంబులెన్స్‌తో సహా వచ్చారు. కరుణానిధిని అంబులెన్స్‌లో ఆసుపత్రిలో చేర్చారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమించిందని, మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించామని తమిళనాడు ముఖ్యమంత్రి వ్యక్తిగత వైద్యులు డాక్టర్ గోపాల్ తెలిపారు. కరుణానిధి ఆరోగ్యం విషమంగా ఉందని, రక్తపోటు పడిపోయిందని ఆయన వివరించారు. ఆయన్ను ఐసీయూలో చేర్చుతున్నామన్నారు.