కృష్ణార్జున యుద్దం సినిమాలోని పెంచల్ దాస్ వ్రాసిన...
దారి చూడు దుమ్ము చూడు మామ...ప్రేక్షకులను ఒక ఊపు ఉపింది....
దారి చూడు దుమ్ము చూడు మామ
దున్న పోతుల బేరే చూడూ
దారి చూడు దుమ్ము చూడు మామ
దున్న పోతుల బేరే చూడూ
కమలపూడి కమలపూడి కట్టమిందా మామ
కన్నె పిల్లల జోరే చూడు
కమలపూడి కట్టమిందా మామ
కన్నె పిల్లల జోరే చూడు
బులుగు సొక్క ఏసినవాడ పిలగా
చిలక ముక్కు చిన్న వాడా
బులుగు సొక్క ఏసినవాడ పిలగా
చిలక ముక్కు చిన్న వాడా
చక్కని చుక్కా చక్కని చుక్కా
దక్కె చూడు మామ
చిత్ర కన్ను కొంటె వాడా
చిత్ర కన్ను కొంటె వాడా…
చిత్ర కన్ను కొంటె వాడా
మేడలోని కుర్రదాన్ని పిల్లగా
ముగ్గులోకి దింపినావూ
మేడలోని కుర్రదాన్ని పిల్లగా
ముగ్గులోకి దింపినావూ
నిన్ను కోరీ, నిన్ను కోరీ వన్నె లాడి లైలా
కోట దాటి పేట చేరే..
కురస కురస అడవిలోనా పిల్లగా
కురిశనే గాంధారీ వానా
కురస కురస అడవిలోనా పిల్లగా
కురిశనే గాంధారీ వానా
ఎక్కరాని ఎక్కరాని కొండలెక్కి మామ
ప్రేమలోనా చిక్కినావు
ఎక్కరాని కొండలెక్కి మామ
ప్రేమలోనా చిక్కినావు
పూల చత్రి పట్టుకొని పిల్లగా
ఊరు వాడ తోడు రాగా
పూల చత్రి పట్టుకొని పిల్లగా
ఊరు వాడ తోడు రాగా
జంటగానే, జంటగానే కూడినారు మామ
చలువ పందిరి నీడ కిందా
జంటగానే కూడినారు మామ
చలువ పందిరి నీడ కిందా
కన్నె పిల్లల జోరే చూడు
ఈ పాటలో వున్నా జోష్ మరే పాటలోనూ ఈ మద్య రాలేదు అనవచ్చు. శ్రీ.కో.