సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌తో నేరస్తుల గుండెలు జారెను

Update: 2018-08-09 11:31 GMT

విజయవాడలో నూతన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌,

అత్యాధునిక పరికరాలతో ల్యాబ్‌ ఏర్పాటే మిషన్,

రాష్ట్రంలో ఏడు ప్రాంతాలకు సైబర్ ల్యాబ్స్ సజేషన్,

నిందితులను త్వరగా పట్టుకునేందుకే స్మార్ట్స్టేషన్. శ్రీ.కో 


సైబర్ క్రైమ్‌ను అరికట్టేందుకు పోలీసులు విజయవాడలో నూతన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ ఏర్పాటు చేశారు. అత్యాధునిక పరికరాలతో ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. రాష్ట్రంలో ఏడు ప్రాంతాల్లో సైబర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నారు. విజయవాడలో క్రైమ్ రేటును తగ్గించేందుకు ఇంటర్ సెప్టార్స్ వాహనాలను ఆవిష్కరించారు. సిటీ పరిధిలో 12 ఇంటర్ సెప్టార్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. ప్రతీ వాహనంలో నలుగురు పోలీసు సిబ్బంది ఉంటారు. వాహనంలో అన్ని రకాల పరికరాలు ఉంటాయి. జీపీఎస్ సిస్టమ్ ఉంటుంది. ఏదైనా నేరం జరిగినప్పడు దగ్గరలో ఉన్న ఇంటర్ సెప్టార్ బృందానికి సమాచారమందిస్తారు. దీంతో నిందితులను త్వరగా పట్టుకునేందుకు అవకాశముంటుందని డీజీపీ తెలిపారు.

Similar News