యముడికి మొగుడు, 1988లో విడుదలైన ఒక రఫ్ఫ్ ఆడించిన చిరంజీవి సినిమా. ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం చేశాడు. ఇది బాగా విజయనంతమైంది. తరువాత రజనీకాంత్ హీరోగా తమిళంలో పునర్నిర్మింపబడింది. ఇలాంటి కథానేపథ్యంలో తెలుగులో దేవాంతకుడు, యమగోల, యమదొంగ లాంటి అనేక సినిమాలు విజయనంతమయ్యాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే కాళి (చిరంజీవి) ఒక చిన్న పట్టణంలో చిన్నపాటి రౌడీ. తన సంపాదనతో సమాజానికి కొంత సేవ చేస్తుంటాడు కూడా. అలా అందరి అభిమానం సంపాదించుకొంటాడు.
అతని బాస్ కోటయ్య (కోట శ్రీనివాసరావు). కోటయ్య ప్రత్యర్థి కైలాసం (గొల్లపూడి). కైలాసం కూతురు (రాధ)తో కాళీ ప్రేమలో పడతాడు. వారు పెళ్ళి చేసుకొందామనుకొంటారు. ఇది తెలిసిన కైలాసం కాళీని చంపిస్తాడు. చనిపోయిన కాళీ నరకానికి వెళతాడు. అక్కడ తనను అన్యాయంగా తెచ్చారని యముడితో (కైకాల సత్యనారాయణ) గొడవ పడతాడు. ఆ తరువాత కథ అనేక మలుపులు తిరుగుతుంది. మీకు యమ దొంగ.. యమగోల నచ్చింది అంటే.. తప్పక ఈ సినిమా కూడా నచ్చుతుంది.