స్టార్.. స్టార్.. మెగాస్టార్ చిరంజీవి,
పుట్టిన రోజు నేడు జరుగుతున్నవి,
అభిమానుల గుండెలు చిరంజీవ..చిరంజీవ,
అని సంతోషంతో నిండిపోయి వున్నావి. శ్రీ.కో.
మెగాస్టార్ చిరంజీవి ఈరోజు తన 63వ పుట్టిన రోజు వేడుకలను నేడు జరుపుకుంటున్నారు, తమ కుటుంబ సభ్యులతో కలసి ఈ వేడుకలు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో చిరంజీవికి టాలీవుడ్ సినీ రంగస్థలానికి సంబంధించిన ప్రముఖులు, యంగ్ హీరోలు, హీరోయిన్స్ తో పాటు పలువురు అభిమానులు సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక బర్త్‌డేకి ఒక్క రోజు ముందుగానే సైరా టీజర్ విడుదల చేసి అభిమానులలో నూతనుత్తేజం తెచ్చారు రామ్ చరణ్. హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో 'బర్త్ డే సెలబ్రేషన్స్ ఆఫ్ మెగాస్టార్' పేరిట ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అభిమానులు భారీగా హాజరయ్యారు. మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ తో పాటు అల్లు అరవింద్ , నాగేంద్ర బాబు ,హీరో సునీల్, పరుచూరి బ్రదర్స్, ఉత్తేజ్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బన్నీ, చెర్రీలు మాట్లాడుతూ, చిరంజీవి నుంచి ముందుగా మానవత్వపు విలువలు నేర్చుకోవలసి ఉందని అన్నారు..