భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చరిత్రలో
కొత్త అధ్యాయం,
డ్రాఫ్ రాజ్యాంగంతో,
లాబీయింగ్‌ను అడ్డుకోవాలన్న ఉద్దేశ్యంతో,
ఒకే రాష్టం ఒకే ఓటు సాధన దిశలో. శ్రీ.కో.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. బిసిసిఐకు రాజ్యాంగాన్ని నిర్మించేందుకు జస్టిస్ లోధా కమిటి సిఫరాసులలో రెండింటిని సుప్రీం గురువారం సవరించి డ్రాఫ్ రాజ్యాంగాన్ని ఆమోదించింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి దీపక్‌మిశ్రా, ఖల్విన్కర్, చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్..గురువారం తుది విచారణ అనంతరం డ్రాఫ్ రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సుప్రీం ఏర్పాటు చేసిన లోధా కమిటీ కొన్ని కఠిన సిఫారసులను చేసింది. అందులో ప్రతి రాష్టనికి ఒక ఓటు ఉంటుంది. ఒక రాష్టంలో ఎన్ని క్రికెట్ సంఘాలు ఉన్నా అన్నింటినీ ఒకే అథారిటీకిందకు తెచ్చి ఒకే ఓటుగా పరిగణించాలన్న బిసిసిఐ పట్టును లోధాకమిటీ కూడా ఆమోదించింది.అయితే వివిధ క్రికెట్ సంఘాలు ఈ నిబంధనలను వ్యతిరేకంచాయి. మహరాష్ట, గుజరాత్, కర్ణాటక,తమిళనాడులలో దశాబ్దాలుగా వివిధ క్రికెట్ సంఘాలు సేవలు అందిస్తున్నాయి. వీటికి ఇప్పటికే బిసిసిఐలో ఓటు హక్కు ఉంది. ఎన్నికల సమయంలో లాబీయింగ్‌ను అడ్డుకోవాలన్న ఉద్దేశ్యంతో బిసిసిఐ ఒకే రాష్టం ఒకే ఓటు విధానానికి పట్టు పట్టి సాధించింది అని మేధావులు అంటున్నారు.