ఇది 1980లో విడుదలైన తెలుగు చిత్రం. జీతేంద్ర, రీనారాయ్, తాళ్ళూరి రామెశ్వరి నటించిన హిందీ చిత్రం 'ఆశా' ఆధారంగా ఎన్.టి.ర్ సొంతముగా నిర్మించిన సినీమా. ఈ సినిమాకు పరుచూరి సోదరులు రచన చేశారు (ఎన్.టి.ఆర్ కు తొలిసారిగా). ఈ సినిమాలోని నటులు...నందమూరి తారక రామారావు, జయసుధ, శ్రీదేవి, నందమూరి బాలకృష్ణ. అలాగే ఈ సినిమా కథ ...... ఎన్.టి.ఆర్ లారీ ద్రైవర్. శ్రీదేవి పేరున్న గాయకురాలు. వారిరువురికి పరిచయం కలుగుతుంది. శ్రీదేవి అతన్ని ప్రేమిస్తుంది. ఐతే ఆ డ్రైవర్ కు అప్పటికే పెళ్లైపోయి ఉంటుంది (జయసుధ తో). ఒక ప్రమాదం వల్ల వారిరువురూ విడిపోతారు. జయసుధను ప్రమాదం నుండి బాలకృష్ణ కాపాడుతాడు. డ్రైవరు పట్ల ఆశ పెంచు కున్న శ్రీదేవి చివరలో రామారావు, జయసుధ కలవడంతో వంటరిగా మిగిలిపోతుంది. శ్రీ.కో.