డిఎంకే పార్టీకి అళగిరితో వచ్చెను ఇబ్బంది,
అన్నదమ్ముల తరతరాల సవాలు అయ్యింది.
చీలిక తెచ్చి వేరు కుంపటి పెట్టాలని వచ్చిందా,
అళగిరి అన్నట్టు కాలమే సమాధానం చెబుతుందా. శ్రీ.కో
కరుణానిధి మరణించి కనీసం కొన్ని రోజులు కూడా కాక ముందే డిఎంకే పార్టీకి అళగిరితో ఇబ్బంది ప్రారంభమైంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని కరుణానిధి 2014లో అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు సమాచారం. అళగిరి తిరిగి పార్టీలోకి చేరేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో స్టాలిన్ వద్దకు తన అనుచరులను రాయబారం పంపాడు. దానికి ప్రతిగా అళగిరి ప్రతిపాదనను స్టాలిన్ తిరస్కరించినట్లు సమాచారం. దీంతో డిఎంకేలో చీలిక తెచ్చి వేరు కుంపటి పెట్టాలని అళగిరి భావిస్తున్నట్లు తెలిసింది. అళగిరి కరుణానిధికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మా తండ్రికి దగ్గర బంధువులందరూ నా వైపే ఉన్నారు, మద్దతుదారులందరూ నా వెనకే ఉంటూ నన్ను ప్రోత్సహిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. కాలమే దీనికి సమాధానం చెబుతుందంటూ వేదాంతం వల్లించారు.