Gold Price Today: సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన బంగారం ధర..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Price Today: సెప్టెంబర్ 22, ఆదివారం బంగారం ధర సరికొత్త రికార్డును సృష్టించింది. ఈరోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. నేడు ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల, 10 గ్రాముల బంగారం ధర రూ. 75930 వద్ద పలికింది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,600 వద్ద పలికింది.
Gold Price Today: సెప్టెంబర్ 22, ఆదివారం బంగారం ధర సరికొత్త రికార్డును సృష్టించింది. ఈరోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. నేడు ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల, 10 గ్రాముల బంగారం ధర రూ. 75930 వద్ద పలికింది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,600 వద్ద పలికింది.
ఈరోజు బంగారం ధర తన పాత రికార్డులను చేరిపి వేస్తూ సరికొత్త రికార్డును సృష్టించింది. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర దాదాపు 500 రూపాయలు పెరిగింది. దీంతో పసిడి మార్కెట్లో సరికొత్త రికార్డు నమోదు అయింది. తొలిసారిగా బంగారం ధర 76 వేల రూపాయల దిశగా అడుగుపెడుతోంది. బంగారం ధర గతంలో 75600 వద్ద ఆల్ టైం రికార్డ్ స్థాయిని సృష్టించింది.
బంగారం ధర భారీగా పెరగడానికి అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బంగారం ధర పెరగడానికి అమెరికాలోని ఆర్థిక మాంద్యం స్థితి కలవరానికి గురిచేస్తోంది. బంగారం ధరలు భారీగా పెరగడం వెనక ఉన్న ప్రధాన కారణం అమెరికాలో ఔన్సు బంగారం ధర నేడు 2650 డాలర్లకు పెరిగింది.
బంగారం ధర రికార్డు స్థాయిలో పెరుగుతోంది. దీనికి తోడు ఇటీవల అమెరికా ఫెడరల్ రిజర్వ్ విడుదల చేసిన కీలక వడ్డీ రేట్లు తగ్గింపు కూడా బంగారం ధరల పెరుగుదలను శాసిస్తున్నాయి. వడ్డీ రేట్లు ఒక్క సారిగా తగ్గించడంతో అమెరికా విడుదల చేసిన ట్రెజరీ బాండ్లపై వచ్చే రాబడి తగ్గిపోయింది. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు బంగారాన్ని సురక్షిత స్థానంగా గుర్తిస్తున్నారు.
ఫలితంగా బంగారం వైపు పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి కనపరుస్తున్నారు. బంగారం ధరలు చారిత్రక గరిష్ట స్థాయిని తాకిన నేపథ్యంలో దేశీయంగా కూడా మార్కెట్లో ప్రకంపనాలు కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్ అయిన దసరా, దీపావళి, ధన త్రయోదశి సందర్భంగా మన దేశంలో పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అయితే భారీగా పెరిగిన ఈ ధరల నేపథ్యంలో కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆభరణాల దుకాణా దారులు చెబుతున్నారు.