పుస్తకం పట్టుకుంటే మస్తకం నిద్రలోకి ఎందుకు?

Update: 2019-03-05 09:56 GMT

పుస్తకం పట్టుకుంటే మస్తకం నిద్రలోకి ఎందుకు? ఇప్పుడు విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు పరిక్షల కాలం నడుస్తుంది. అయితే ఒక్కో సారి మనం చదువుకుంటున్నప్పుడు మనలో చాలా మందికి ఎందుకు నిద్ర వస్తుందో మీకు తెలుసా? అయితే చదివేటపుడు నిద్ర రావడమనేది మనము ఏ భంగిమలో ఉన్నాము,ఎంతసేపు ఉన్నాము అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. చదివేటప్పుడు శరీర కదలికలు తక్కువగా ఉండటం వలన కండరాలకు ప్రవహించే రక్తము తగ్గుతుంది . దాని ములాన కండరాలలోని జీవకణాలలో దహనచర్య మందగించి " లాక్టిక్ యాసిడ్ " అనే ఆమ్లము తయారవుతుంది . ఈ ఆమ్లము ప్రాణవాయువైన ఆక్షిజన్‌ ను అతిగా గ్రహిస్తుంది . . దాంతో దేహములోని రక్తానికి కావలసిన ఆక్షిజన్‌ లో కొంత తగ్గుదల వస్తుంది. ఆక్షిజన్‌ తగినంతగా లేని రక్తం మెదడులోకి ప్రవహించడం వల్ల మగతగా , నిద్ర వస్తున్నట్లుగా ఉంటుంది . అందుకే చదివేటపుడు ఒకే భంగిమలో ఉండిపోకుండా అప్పుడప్పుడు అటు ఇటూ కదలడం , ఏకుబికిన చదవకుండా మధ్యలో కాస్త విరామము ఇవ్వడం చేస్తే నిద్ర రాదు. కాబట్టి చిన్న చిన్న విరామాలు మద్యలో తీసుకోవచ్చు. శ్రీ.కో.

Similar News