వేసవిలో పగటికాలం ఎక్కువ ఎందుకని ఉంటుందో మీకు తెలుసా? వేసవిలో పగటి పొద్దు ఎక్కువ ఉంటుంది అని మనకు తెలిసిందే, అలాగే చలికాలములో రాత్రి పొద్దు ఎక్కువకాలము ఉంటుంది. ఈ రెండింటి మధ్య వుండే తేడా భూమిమీద ఒక్కొక్క చోట ఒకలా ఉంటుందట. భూమి అక్షం 23 1/2 డిగ్రీలు వంగి ఉండడమువల్ల, బూపరిభ్రమణం వల్ల, అలాగే ఉత్తరధృవం ధృవనక్షత్రాన్ని ఎప్పుడూ సూచిస్తున్నందున ఈ వ్యత్యాసము ఏర్పడిందట. దీనివల్ల వేసవిలో ఎక్కువభాగము భూమి మీద కాంతికిరణాలు పడతాయి,ఫలితముగా పగలు ఎక్కువవుతుంది. అక్షాంశములు పెరుగేకొద్దీ వేసవిలో పగటికాలం పెరుగుతున్దట. శ్రీ.కో.