పక్షులన్నింటి కెల్లా అతి పెద్ద పక్షి, వేగంగా పరుగేత్తగల పక్షి

Update: 2019-02-12 06:47 GMT

భూమి మీద ప్రస్తుతం జీవించి ఉన్న పక్షులన్నింటి కెల్లా అతి పెద్ద పక్షి ఏదో మీకు తెలుసా! భూమి మీద ప్రస్తుతం జీవించి ఉన్న పక్షులన్నింటి కెల్లా అతి పెద్ద పక్షి ఆస్ట్రిచట. ఆస్ట్రిచ్ కళ్లు 50 మిల్లీమీటర్ల (రెండు అంగుళాలు) వ్యాసార్థంతో ఉంటాయి. ఆస్ట్రిచ్ కాళ్లు, మెడ చాలా పొడవుగా ఉండటం వలన ఇది చాలా ఎత్తుగా ఉంటుంది. ఆస్ట్రిచ్‌లు దాదాపు 1.8 నుంచి 2.75 మీటర్ల (ఆరు నుంచి తొమ్మిది అడుగులు) ఎత్తు, బరువు 63 నుంచి 130 కిలో గ్రాములు ఉంటుంది. కొన్ని మగ ఆస్ట్రిచ్‌లు 155కిలో గ్రాములు వరకు బరువు ఉంటాయి. ఆస్ట్రిచ్ కళ్లు పెద్దవిగా ఉండటం వలన అవి చాలా దూరంలో ఉన్న శత్రువులను కూడా సులభముగా కనిపెట్టగలవు. శత్రువులను చూసిన వెంటనే ఆస్ట్రిచ్‌లు నేలపై పడుకుంటాయి లేదా పరుగెత్తుతాయి. ఆస్ట్రిచ్‌లు గంటకు 60 నుండి 72.4 కిలోమీటర్ల (45 మైళ్ల ) వేగంతో పరుగెత్తుతాయి. ఆస్ట్రిచ్‌లు నిలువకుండా 30 నిమిషాలు పరుగెత్త గలవు. శ్రీ.కో

Similar News