చెత్త నుంచి కరెంటును ఎలా ఉత్పత్తి చేస్తారో మీకు తెలుసా! చెత్త అంటే పనికిరాని పదార్థాల సముదాయం. కానీ చెత్తతో కూడా ఉపయోగం ఉందన్న విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఈ మధ్య అన్ని దేశాల్లో ఘనవ్యర్థ పదార్థాల కార్యకలాపం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఉదాహరణకు... తినగా మిగిలిన పదార్థాలు కుళ్లిపోవడం వల్ల కానీ, మనం పారేసిన చెత్త పదార్థాలు కానీ అన్నీ కూడా సేంద్రియ రసాయనాలే. వాటిల్లో ఎంతో శక్తి దాగి ఉంటుంది. అలాంటి వ్యర్థ కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు, ప్లాస్టిక్కులు, పేపర్లు, ఆకులు, పాచీ వగైరా పదార్థాల్ని ఎండబెట్టి వాటిని మండించడం ద్వారా విడుదలయ్యే ఉష్ణశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చగలరట. వ్యర్థ కాగితాల్ని తిరిగి నానబెట్టి గుజ్జుగా మార్చి కొత్తగా కాగితాన్ని తయారు చేయవచ్చు. ఇలా ఎన్నో వ్యర్థ పదార్థాల్ని తిరిగి పునర్వినియోగం చేసే కార్యకలాపం మన దేశంతో సహా అన్ని దేశాల్లో ఉందట. శ్రీ.కో.