ఫుల్లుగా మందు తాగి వూగే వ్యక్తిపై నీళ్లు కుమ్మరిస్తే మత్తు దిగిపోతుందా?

Update: 2019-02-12 10:53 GMT

మందుబాబులు తాగే ద్రావణంలో నీరు అధికంగానూ, ఇథైల్‌ ఆల్కహాలు కొద్దిగానూ ఉంటాయి. ఆల్కహాలు మోతాదునుబట్టి ఆయా పానీయాల మత్తు తీవ్రత ఆధారపడుతుంది. ఇథైల్‌ ఆల్కహాలుకు తనంత తానుగా మత్తును కలిగించే గుణం లేదు. తాగినప్పుడు ఏ జీర్ణ ప్రక్రియ అవసరం లేకుండానే కొద్దిసేపటికే రక్తంలో కలిసే గుణం దీనికి ఉంది. రక్తంలో కలిసిన వెంటనే అది దేహంలోని కణ జాలాల్లోకి బాగా త్వరితంగా చేరుకోగలుగుతుంది. కణాల్లోకి వెళ్లక అది సాధారణంగా అసిటాల్డిహైడుగా మారుతుంది. సారాయి తాగిన వాళ్ల దగ్గర్నుంచి వెలువడే దుర్గంధం దీనిదే. ఇది మెదడు కణాల్లోని అమైనో ఆమ్లాలలో చర్య జరిపి మత్తును, కైపును కలిగిస్తుంది. తీసుకున్న మోతాదును బట్టి ఆ తాగుబోతు ప్రవర్తన, శరీర క్షేమం ఆధారపడ్తాయి. సారాయి, అసిటాల్డిహైడ్‌ నీటిలో బాగా కరుగుతాయి. మత్తులో జోగుతున్న మనిషి మీద బకెట్టు నీళ్లు పోస్తే అవి బట్టలను తడపడం వల్ల చాలా సేపు చర్మం చెమ్మగా ఉంటుంది కాబట్టి కనీసం చర్మంలో ఉన్న కణాల్లోని ఆల్కహాలు సంబంధిత రసాయనాలు బయటపడతాయి. ఒక్కసారిగా శరీర ఉపరితల ఉష్ణోగ్రత మారడం వల్ల కూడా ఆల్కహాలు ప్రభావం కొంత దిగుతుందట. శ్రీ.కో

Similar News