సీతాకోక చిలుకలు ఎంత దూరం పయనించగలవో మీకు తెలుసా! రంగు రంగుల సీతకోకచిలుకలంటే అందరికి ఇష్టమే, అయితే సీతాకోకచిలుకలు ఉన్న ప్రాంతాల్లోనే ఒక చెట్టుమీది పూల నుంచి మరో చెట్టుమీద పూలపైకి వాలుతుంటాయి. కానీ కొన్ని తెగల సీతాకోక చిలుకలు ఎగురుతూ ఎంతో దూరం వెళ్ళగలవట. అలాంటి వాటిలో అమెరికాలో ఉండే 'అమెరికన్ మోనార్క్' బటర్‌ఫ్త్లెలు ఉత్తర అమెరికా నుంచి శరత్‌కాలంలో (autumn)లో బయలు దేరి మెక్సికోను చేరుకొని అక్కడ శీతాకాలమంతా జీవనం సాగిస్తాయి. ఈ కీటకాలు 3000 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరాన్ని 8 నుంచి 12 వారాల్లో పయనిస్తాయి. ఇవి రోజుకు సరాసరి 70 కిలోమీటర్ల దూరం పయనించగలవట. శ్రీ.కో.