ZELIO Ebikes: కొత్త ఎలక్ట్రిక్ వచ్చేసింగ్.. సింగిల్ ఛార్జ్‌పై 100 కిమీ రేంజ్
ZELIO Ebikes: స్వదేశీ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీ ZELIO Ebikes కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయబోతోంది.
ZELIO Ebikes: స్వదేశీ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీ ZELIO Ebikes కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయబోతోంది. కంపెనీ రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్‌ను కూడా విడుదల చేసింది. దీనికి X-MEN 2.0 అని పేరు పెట్టారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రయాణం కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. కంపెనీ ఈ కొత్త స్కూటర్ లాంచ్ తేదీని కూడా ఫిక్స్ చేసింది. నవంబర్ 12న అధికారికంగా లాంచ్ కానుంది.
X-MEN మోడల్ గొప్ప విజయం తర్వాత X-MEN 2.0 పరిచయం చేస్తుందని ZELIO నివేదించింది. మెరుగైన ప్రయాణ అనుభవం కోసం దీన్ని డిజైన్ చేశారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అధునాతన ఫీచర్లు, మరింత సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, ఇది రోజువారీ వినియోగదారులకు గొప్ప అనుభూతిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
X-MEN 2.0 Features
అనేక నగరాల నుంచి వచ్చే కస్టమర్ల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎక్స్-మెన్ 2.0ని తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అన్ని రకాల వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది. అందులో పాఠశాల, కాలేజీ విద్యార్థులు, ఆఫీస్‌లకు వెళ్లేవారు ఉన్నారు. ఇది తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఇది ఫుల్ ఛార్జింగ్‌పై 100 కిమీల రేంజ్‌ను అందజేస్తుందని పేర్కొంది.
X-MEN 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ అన్ని ZELIO Ebikes డీలర్‌షిప్ షోరూమ్‌లలో నవంబర్ 12వ తేదీన అందుబాటులో ఉంటుందని ZELIO ప్రకటించింది. లాంచింగ్ ఈవెంట్‌లో స్కూటర్క్క అన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు, ధర వెల్లడికానున్నాయి. X-MEN 2.0 గురించి కస్టమర్‌లు చాలా ఉత్సాహంగా ఉన్నారు. లాంచ్ తర్వాత దాని గురించి మరింత సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది.