Cheapest Electric Scooter Launch: చీపెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే.. రూ.79 వేలతో ఇంటికి తీసుకెళ్లొచ్చు..!

Cheapest Electric Scooter Launch: వారివో మోటార్స్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ CRXని విడుదల చేసింది. దీని ధర రూ. 79,999.

Update: 2024-09-13 11:22 GMT

Warivo CRX

Cheapest Electric Scooter Launch: భారత్ ఆటోమొబైల్ మార్కెట్ ఎలక్ట్రిక్ వాహనాలను ఎర్రతివాచి పరిచి ఆహ్వానిస్తోంది. వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్ అనుగుణంగా కంపెనీలు కూడా వాహనాలను విడుదల చేస్తున్నాయి. వీటి సేల్స్ కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మీరు కూడా రోజువారీ అవసరాలకు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ఈ వార్త మీకోసమే.

వారివో మోటార్ ఇండియా తన మొట్టమొదటి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ CRXని విడుదల చేసింది. వాటిలో CRX 5 అనేక కలర్స్‌లో అందుబాటులో ఉంది. కంపెనీ లేటెస్ట్ టెక్నాలజీ, అద్భుతమైన పనితీరుతో వేరివో సిఆర్‌ఎక్స్‌ను రూ. 79,999 ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ చేసింది. కొత్తగా విడుదల చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు, రేంజ్, బ్యాటరీ గురించి వివరంగా తెలుసుకుందాం.

వేరివో CRX ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 42 లీటర్ల బూట్ స్పేస్, టైప్-సి మొబైల్ ఛార్జింగ్ పాయింట్, 150 కిలోల అధిక లోడింగ్ కెపాసిటీ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 55 కిలోమీటర్లు. ఇది 2 రైడింగ్ మోడ్‌లు, ఎకో, పవర్‌లో వస్తుంది. మరోవైపు భద్రత కోసం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అధునాతన వాటర్‌ప్రూఫ్, ఫైర్‌ప్రూఫ్, బ్లాస్ట్ ప్రూఫ్ బ్యాటరీతో అందించారు.

దీని కారణంగా ఈ స్కూటర్ హీట్ అవ్వదు. అదే సమయంలో స్కూటర్ భద్రత కోసం ఇది UL2271 స్టాండర్డ్ సర్టిఫికేషన్ పొందింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 75 నుంచి 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.ఈ లాంచ్ సందర్భంగా వేరివో మోటార్ ఇండియా సీఈవో షమ్మీ శర్మ మాట్లాడారు.

నేటి భారతీయ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూపొందించాం. Varivo CRX ప్రతి ఒక్కరికీ అనువైనది. ఇది విశ్వసనీయ రైడ్ కోసం వెతుకుతున్న నిపుణులు, సరసమైన, స్టైలిష్ రైడ్ కోసం చూస్తున్న విద్యార్థులు లేదా తమ పిల్లలను పాఠశాలకు తరలించడానికి సురక్షితమైన రైడ్ కోసం వెతుకుతున్న మహిళలకు మంచి ఎంపిక. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులందరి అంచనాలను అందుకుంటుంది.

Tags:    

Similar News