ఇలాంటి కార్లు మీ దగ్గరున్నాయా.. కోట్లు మీ సొంతమైనట్లే.. పెట్టుబడిలో నయా ట్రెండ్ ఇదే..!
Vintage Car Investment: భారతదేశంలో, ఇప్పుడు పాత కార్లను రీసైక్లింగ్‌కు పంపే వెహికల్ స్క్రాప్ విధానం వచ్చింది. కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి 15 ఏళ్ల నాటి పెట్రోల్ కార్లను జంక్‌యార్డ్‌కు పంపడానికి ప్రభుత్వం ఈ విధానాన్ని రూపొందించింది.
Vintage Car Investment: భారతదేశంలో, ఇప్పుడు పాత కార్లను రీసైక్లింగ్‌కు పంపే వెహికల్ స్క్రాప్ విధానం వచ్చింది. కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి 15 ఏళ్ల నాటి పెట్రోల్ కార్లను జంక్‌యార్డ్‌కు పంపడానికి ప్రభుత్వం ఈ విధానాన్ని రూపొందించింది. అయితే పాత కార్లపై పెట్టిన పెట్టుబడి మీకు అనేక రెట్లు రాబడులను ఇస్తుందని మీకు తెలుసా. అవును, పాతకాలపు కార్లపై పెట్టుబడి ఈ రోజుల్లో కొత్త ట్రెండ్‌గా రూపొందుతోంది.
పాతకాలపు కార్లలో పెట్టుబడి పెట్టడం అనేది ప్రపంచవ్యాప్తంగా కొత్త పెట్టుబడి సాధనంగా మారుతోంది. ఎందుకంటే పాతకాలపు కార్ల యజమానులు వాటిని లగ్జరీ కలెక్షన్ లాగా మెయింటెయిన్ చేస్తుంటారు. వీటిని వేలం వేసినప్పుడు, వారు తమ పెట్టుబడికి భారీ రాబడిని పొందుతున్నారు.
రూ.1162 కోట్లకు వింటేజ్ కారు అమ్మకం..
1977లో, ఫెరారీ 250 GTO 1962 మోడల్‌ను కలిగి ఉన్న వ్యక్తి తన భార్య ఫిర్యాదుతో కారును విక్రయించాడు. ఎందుకంటే ఈ కారు చాలా శబ్దం చేసేదంట. ఆ తర్వాత 2018లో ఇదే మోడల్ కారును వేలం వేయగా.. దాని విలువ 48 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 393 కోట్లు) పలికింది. ఆ తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారుగా అవతరించింది.
గత సంవత్సరం 1955 Mercedes Benz 300 SLR Uhlenhaut Coupe కూడా ఇదే ధరను పొందింది. వేలంలో దీని ధర 14.29 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1162 కోట్లు)గా నిర్ణయించారు.
పాతకాలపు కారు విలువ 185% పెరిగింది..
నైట్ ఫ్రాంక్ 2023 వెల్త్ రిపోర్ట్ ప్రకారం, గత దశాబ్దంలో పాతకాలపు కార్ల విలువ 185 శాతం పెరిగింది. ఇది లగ్జరీ వైన్‌లు, గడియారాలు, కళాఖండాల సేకరణలో వృద్ధి కంటే ఎక్కువ పెరగిందంట.