Vespa: ఇది స్కూటరా, పుష్పక విమానమా.. ధర చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. ఇంత స్పెషల్ ఏంటో తెలుసా?
Vespa 946 Dragon Edition: వెస్పా 946 డ్రాగన్ ఎడిషన్ భారతదేశంలో విడుదల చేసింది.
Vespa 946 Dragon Edition: వెస్పా 946 డ్రాగన్ ఎడిషన్ భారతదేశంలో విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.14.27 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. కంపెనీ కేవలం 1888 యూనిట్లను మాత్రమే మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఎడిషన్ హాంకాంగ్ న్యూ ఇయర్ సందర్భంగా ప్రారంభించింది. మీరు ఈ స్కూటర్‌ని కొనుగోలు చేయాలనుకుంటే, పియాజియో షోరూమ్‌కి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ స్టాండర్డ్ వెస్పా మోడల్ 946 ఆధారంగా రూపొందించారు. అయినప్పటికీ, దీనికి కొత్త పెయింట్, కొంత ఆర్ట్‌వర్క్ ఇచ్చారు. ఇది భిన్నంగా ఉంటుంది.
దీని డిజైన్ బలం, శక్తి, అదృష్టానికి చిహ్నంగా ఆసియా సంప్రదాయాలలో డ్రాగన్ ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. ఇందులో 150 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు. ఇది సింగిల్ సిలిండర్ ఇంజిన్. దీని నిర్వహణ, భద్రత 12-అంగుళాల వీల్ బేస్, 220 mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో అందించింది. స్కూటర్‌ను కొనుగోలు చేసిన వారికి వర్సిటీ జాకెట్‌ను కూడా బహుమతిగా అందజేస్తారు. ఈ జాకెట్ కూడా ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
పియాజియో డిస్నీ సహకారంతో మిక్కీ మౌస్ ఎడిషన్‌ను కూడా ప్రారంభించింది. ఇది డిస్నీ 100వ వార్షికోత్సవం సందర్భంగా విడుదలైంది. అయితే, ఈ ఎడిషన్ భారతదేశంలో ప్రారంభించలేదు. ఇది 50, 125, 150 cc మోడళ్లలో విడుదల చేశారు.