EV Cars: గెట్ రడీ.. భారత మార్కెట్లోకి వచ్చేందుకు రెడీ అవుతోన్న కొత్త ఎలక్ట్రిక్ కార్స్..!
EV Cars: ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ, ఇంధన కొరత కారణం ఏదైనా ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి.
EV Cars: ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ, ఇంధన కొరత కారణం ఏదైనా ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. అయితే ప్రారంభంలో ఈవీ వెహికిల్స్ అంటే పికప్ ఎక్కువ ఉండవు, ఫీచర్స్ కొన్ని మాత్రమే ఉంటాయనే ఆలోచన ఉండేది. కానీ ప్రస్తుతం కాలం మారింది. ఎలక్ట్రిక్ కార్లలో కూడా అధునాతన ఫీచర్లు వస్తున్నాయి. దాదాపు అన్ని టాప్ కంపెనీలు ఈ రంగలోకి అడుగు పెడుతుండడంతో ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత మార్కెట్లోకి పలు ప్రముఖ కంపెనీఉల కొత్త ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇంతకీ ఈ కార్లు ఏంటి.? వాటి ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..
* ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్న ఈవీ కార్లలో టాటా హారియర్ ఈవీ ఒకటి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాటా హారియర్‌తో పోల్చితే మరింత పెద్దగా, మరిన్న అధునాతన ఫీచర్లతో ఈ కారు ఉండనుందని సమాచారం. ఇక ఈ ఎలక్ట్రిక్ కారు ధర విషయానికొస్తే రూ. 30 లక్షలు ఎక్స్ షోరూమ్ ప్రైజ్‌గా ఉండనున్నట్లు సమాచారం.
* ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మహీంద్రా కూడా టాటా హారియర్ ఈవీకి పోటీగా మహీంద్రా XUV.e8 పేరుతో కొత్త కారును లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇది మహీంద్రా XUV 700 ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ధర విషయానికొస్తే ఈ కారు రూ. 35 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రైజ్‌తో రానుంది.
* ఆటోమొబైల్ రంగంలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న కార్లలో టాటా కర్వ్ ఈవీ ఒకటి. నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీలకు పోటీగా ఈ కారును తీసుకొస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ కారు అందుబాటులోకి రానుంది. ఇక ధర విషయానికొస్తే రూ. 20 లక్షలు ఎక్స్ షోరూమ్ ప్రైజ్‌గా ఉండనుంది.
* కియా సైతం ఈ ఏడాది కొత్త ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. కియా ఈవీ9 పేరుతో తీసుకొస్తున్ ఈ కారును వచ్చే నెలలో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. 9 సీటర్ కెపాసిటీతో లాంచ్ చేయనున్న ఈ కారు ధర సుమారు రూ. కోటిగా ఉండొచ్చని అంచనా.