Upcoming Cars: ఇదిగో కొత్త కార్లు.. ట్రెండ్‌కు తగ్గట్టుగా వచ్చేస్తున్నాయ్..!
Upcoming Cars: వచ్చే నెల మూడు కొత్త కార్లు లాంచ్ కానున్నాయి.అందులో నిస్సాన్, కియా ఉన్నాయి.
Upcoming Cars: మీరు కొత్త కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా సిద్ధంగా ఉండండి ఎందుకంటే వచ్చే నెల దేశంలో 3 కొత్త కార్లు విడుదల కానున్నాయి. ఈ పండుగ సీజన్‌లో తమ విక్రయాలను పెంచుకునేందుకు కార్ల కంపెనీలు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. నిస్సాన్, కియా తమ కొత్త కార్లను భారతదేశంలో విడుదల చేయబోతున్నాయి. లాంచ్ చేయబోయే కొత్త మోడల్స్ గురించి తెలుసుకుందాం.
నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్
నిస్సాన్ ఇండియా తన కాంపాక్ట్ SUV మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్‌ను వచ్చే నెల విడుదల చేయబోతోంది. ఈసారి కొత్త మోడల్‌లో చాలా పెద్ద మార్పులు కనిపించబోతున్నాయి. మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ అక్టోబర్ 4న ఆవిష్కరించనున్నారు. లాంచ్‌కు ముందు ఈ కొత్త మోడల్ టీజర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ SUV రూ.6 లక్షల బడ్జెట్‌లో అందుబాటులో ఉంది. ఇది ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ SUV. కొత్త మోడల్ డిజైన్‌లో కొత్తదనం కనిపిస్తుంది.
వివరంగా చెప్పాలంటే దాని ముందు భాగంలో కొత్త బంపర్, హెడ్‌లైట్లు కనిపిస్తాయి. దీనితో పాటు కొత్త ఫ్రంట్ గ్రిల్ కూడా ఇందులో ఇవ్వబడింది. ఇది మాత్రమే కాదు దాని వెనుక బంపర్ టెయిల్‌లైట్లు, అల్లాయ్ వీల్స్‌లో మార్పులు చేయడం ద్వారా కొత్త రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేయవచ్చు. ఇంటీరియర్‌లో కూడా మార్పులు చేయవచ్చు.
ప్రస్తుతం Magnite ఎక్స్-షోరూమ్ ధర రూ.5.99 లక్షల నుండి రూ.11.27 లక్షల వరకు ఉంది. కానీ కొత్త మోడల్‌లో కొత్త ఫీచర్లు ఉండనందున ధర కొంచెం ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు. ఇది మాన్యువల్, CVT గేర్‌బాక్స్‌తో కూడిన 1.0L పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది.
కియా ఆల్-న్యూ కార్నివాల్ లిమోసిన్
కియా ఇప్పుడు దేశంలో సరికొత్త కార్నివాల్ లిమోసిన్‌ను అక్టోబర్ 3న విడుదల చేయబోతోంది. కార్నివాల్ ఇప్పుడు పూర్తిగా కొత్త అవతార్‌లో రానుంది. దీని బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. బుకింగ్ మొత్తాన్ని రూ.2 లక్షలుగా ఉంచారు. ఇది ఒక లగ్జరీ MPV. ఫీచర్ల గురించి మాట్లాడితే ఇందులో 360 డిగ్రీ కెమెరా, డ్యూయల్ పనోరమిక్ సన్‌రూఫ్, స్మార్ట్ పవర్ స్లైడింగ్ డోర్, 12.3 అంగుళాల కర్వ్డ్ డిస్‌ప్లే, 8 ఎయిర్‌బ్యాగ్‌లు, బోస్ ప్రీమియం సరౌండ్ సౌండ్ వంటి ఫీచర్లు ఉంటాయి. కియా కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ ఈసారి కూడా కుటుంబం, వ్యాపార తరగతిని లక్ష్యంగా చేసుకుంటుంది.
కియా EV9
సరికొత్త కార్నివాల్ లిమోసిన్‌తో పాటు, కియా తన కొత్త ఎలక్ట్రిక్ కారు కియా EV9ని కూడా విడుదల చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 541కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. కొత్త Kia EV9 99.8 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఈ 2 ఎలక్ట్రిక్ మోటార్లు 384 PS పవర్, 700 Nm టార్క్ ఉత్పత్తి చేస్తాయి. నివేదికల ప్రకారం ఈ కారు కియా EV9 ధరకు సంబంధించి ఇంకా ఎటువంటి సమాచారం అందలేదు. అయితే ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 80 లక్షల వరకు ఉంటుంది. .