Car Care Tips: కారులో ఈ వస్తువులు కచ్చితంగా ఉండాలి.. లేదంటే ఇబ్బందుల్లో పడుతారు..!
Car Care Tips: కారులో ప్రయాణించేటప్పుడు కచ్చితంగా మెయింటెన్ చేయాల్సిన కొన్ని వస్తువులు ఉంటాయి. ఇవి లేకపోతే ప్రయాణంలో చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
Car Care Tips: కారులో ప్రయాణించేటప్పుడు కచ్చితంగా మెయింటెన్ చేయాల్సిన కొన్ని వస్తువులు ఉంటాయి. ఇవి లేకపోతే ప్రయాణంలో చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. రోడ్డు మధ్యలో కారు ఆగిపోతే మెకానిక్ అందుబాటులో లేకపోతే అప్పుడు ఈ వస్తువులే మనకు ఉపయోగపడుతాయి. ముఖ్యంగా ఫ్యామిలీతో వెళ్లేటప్పుడు కచ్చితంగా ఇవి ఉన్నాయో లేదా చెక్ చేసుకోవాలి. మీరు కారులో తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన వస్తువుల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
పంక్చర్ రిపేర్ కిట్
టైర్ పంక్చర్ అయినప్పుడు రిపేర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇందులో ట్యూబ్‌లు, ట్యూబ్‌లెస్ రిపేర్ కిట్‌లు, అవసరమైన వస్తువులు ఉంటాయి. అనేక కార్ల తయారీ కంపెనీలు దీనిని కారుతో అందజేస్తున్నాయి.
స్టెప్నీ
కార్లలో స్టెప్నీ అంటే స్పేర్ టైర్. కారు టైరు పంక్చర్ అయినప్పుడు ఈ టైర్ ఉపయోగపడుతుంది. మీరు దీనితో టైర్‌ను భర్తీ చేసి తర్వాత పంక్చర్ అయిన టైర్‌ను రిపేర్ చేసుకోవచ్చు.
గాలి నింపే వస్తువు
మీరు టైర్ ఎయిర్ ఇన్‌ఫ్లేటర్‌తో టైర్లలో గాలిని నింపవచ్చు. కార్ల కోసం పోర్టబుల్ టైర్ ఎయిర్ ఇన్‌ఫ్లేటర్‌లు ఉన్నాయి. ఇది 2000 రూపాయలకు సులభంగా అందుబాటులో ఉంటుంది.
జంప్ స్టార్ట్ కేబుల్
కారు బ్యాటరీ అకస్మాత్తుగా డిశ్చార్జ్ అయినప్పుడు జంప్ స్టార్ట్ కేబుల్ ఉపయోగపడుతుంది. దీనిద్వారా మరొక కారు బ్యాటరీని మీ కారు బ్యాటరీకి కనెక్ట్ చేసి కారును ప్రారంభించవచ్చు.
అగ్ని మాపక పరికరం
ఇది మంటలను ఆర్పడానికి సహాయపడే పరికరం. కారు అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
టూల్ కిట్
ప్రతి కారు యజమానికి కార్ టూల్ కిట్ ఉండాలి. ఇది అత్యవసర పరిస్థితుల్లో కారును రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. ఇందులో అనేక రకాలఉపకరణాలు ఉంటాయి.