Best Mileage Bikes: ఈ బైక్‌లు 80 KMPL మైలేజ్ ఇస్తాయి.. ధరలు తక్కువగా ఉంటాయి..!
Best Mileage Bikes: కొత్తకారు కొనేటప్పుడు చాలామంది దాని మైలేజీ గురించి ఆందోళన చెందుతారు. అందుకే చాలామంది కార్ల కంటే బైకుల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు.
Best Mileage Bikes: కొత్తకారు కొనేటప్పుడు చాలామంది దాని మైలేజీ గురించి ఆందోళన చెందుతారు. అందుకే చాలామంది కార్ల కంటే బైకుల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. మార్కెట్‌లో లీటరు పెట్రోల్‌కు 80 కి.మీ మైలేజీ ఇచ్చే బైకులు చాలా ఉన్నాయి. వీటి ధరలు కూడా మిగతావాటితో పోలిస్తే తక్కువగా ఉంటాయి. ఈ రోజు కొన్ని అత్యధిక మైలేజ్ బైక్‌ల గురించి తెలుసుకుందాం.
టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్
భారతదేశంలో అత్యధిక మైలేజీనిచ్చే బైకులలో ఇది ఒకటి. ARAI ప్రకారం ఇది లీటరుకు 83.09 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇది 110cc ఇంజన్, 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. దీని ధర రూ.77,770 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతుంది.
హీరో స్ప్లెండర్ ప్లస్
హీరో స్ప్లెండర్ చాలా ప్రజాదరణ పొందిన, నమ్మదగిన బైక్. దాదాపు 30 ఏళ్లుగా భారత మార్కెట్‌ను శాసిస్తోంది. హీరో స్ప్లెండర్ ప్లస్ 97.2సీసీ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 4-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఇది 80 kmpl మైలేజీని ఇవ్వగలదని కంపెనీ చెబుతోంది. దీని ధర రూ. 75,141 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతుంది.
హీరో HF డీలక్స్
Hero Moto Corp నుంచి మరొక బైక్ మంచి మైలేజీని ఇస్తుంది. ఇది HF డీలక్స్. ఇందులో 97.2సీసీ ఇంజన్ ఉంటుంది. ఇది 70 kmpl నుంచి 80kmpl వరకు మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ. 60,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతుంది.
బజాజ్ ప్లాటినా 100
బజాజ్ ప్లాటినా 100 సరసమైన, మంచి బైక్. ఇందులో 102సీసీ ఇంజన్, 4-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటాయి. ఇది ఎలక్ట్రిక్ స్టార్ట్‌తో వస్తుంది. ఇది 70 నుంచి 90kmpl మైలేజీని ఇవ్వగలదు. దీని ధర రూ. 67808 నుంచి ప్రారంభమవుతుంది.
బజాజ్ CT 110
బజాజ్ CT 110X పేరును చూస్తే ఇది 110cc ఇంజిన్ అని అనుకుంటారు. కానీ ఇది 115cc ఇంజిన్‌ని కలిగి ఉంటుంది. మైలేజీ విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడలేదు. ఇది దాదాపు 70 kmpl మైలేజీని ఇస్తుంది. CT 110X ధర రూ.69,216 నుంచి ప్రారంభమవుతుంది.