iPhone 16 Pro Max: ఐఫోన్ కంటే ఈ 5 బైక్‌లు చాలా చీప్.. ఏది కొంటే బెటర్ అంటారు..!
iPhone 16 Pro Max: ఆపిల్ iPhone 16 Pro Max కంటే ఈ బైకులను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇవి అధిక మైలేజ్‌ని అందిస్తాయి.
Bikes Under 1.5 Lakhs: భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్ ఇటీవలే చాలా మార్పులను చూసింది. ఇది దేశంలో పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ, ప్రజల ఆదాయాన్ని ప్రతిబింబిస్తుంది. భారత మార్కెట్‌లో ఒకప్పుడు 110 సిసి కమ్యూటర్ బైక్‌లు ఆధిపత్యం చెలాయించగా ఇప్పుడు 125-200 సిసి బైక్‌లను డిమాండ్ పెరిగింది. ఈ పెరుగుతున్న డిమాండ్ ధరలను పెంచింది. ఇప్పుడు వీటి ధరలు రూ. 1.5 లక్షల వరకు చేరింది. ఇది ఇటీవల లాంచ్ అయిన Apple iPhone 16 Pro Max 256GB ధర రూ. 1.45 లక్షలకు సమానం. మీరు యాపిల్ ఐఫోన్ కొనే బదులు బైక్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వార్త మీకోసమే. Apple iPhone 16 Pro Max కంటే తక్కువ ధరలో ఏ బైక్ వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Hero Extreme 125R
హీరో ఎక్స్‌ట్రీమ్ 125R తక్కువ-స్లంగ్ LED హెడ్‌ల్యాంప్‌లు, మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, షార్ప్ LED లైట్లు, స్ప్లిట్ సీట్లు, అప్‌స్వెప్ట్ టెయిల్‌ను కలిగి ఉంది.ఈ బైక్‌లో 125cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంది. ఇది 11.4bhp పవర్, 10.5Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. దీని ఇంజన్ ఐదు-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో లింకై ఉంటుంది. ఇందులో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ స్టాండర్డ్, రియర్ డ్రమ్ లేదా డిస్క్ బ్రేక్ ఆప్షన్‌ను కలిగి ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 95,000, రూ. 99,500 మధ్య ఉంటుంది.
TVS Raider 125
ఈ బైక్ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 11.2bhp పవర్, 11.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజన్ ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. ఈ బైక్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైకుల్లో ఒకటి. బైక్ ఇంజన్ పర్ఫామెన్స్ అనేక మంది యువ రైడర్లను ఆకర్షిస్తుంది. ఇది నాలుగు వేరియంట్లలో వస్తుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 84,869 నుండి రూ. 1.04 లక్షల మధ్య ఉంటుంది.
Bajaj Freedom 125
ఈ బైక్ 125cc ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 9.37 bhp పవర్, 9.7 Nm టార్క్ రిలీజ్ చేస్తుంది. ఈ బజాజ్ బైక్ 2-లీటర్ పెట్రోల్ ట్యాంక్, 2 కిలోల CNG సిలిండర్‌తో వస్తుంది. ఇది ఒకేసారి 330 కి.మీ మైలేజ్ అందిస్తుంది. ఫ్రీడమ్ 125 CNG మూడు వేరియంట్లలో వస్తుంది. ఈ ఎక్స్-షోరూమ్ ధర రూ. 95,000 నుండి రూ. 1.10 లక్షల మధ్య ఉంటుంది.
Honda Hornet 2.0
హోండా హార్నెట్ 2.0 దాని అద్భుతమైన డిజైన్‌తో 200cc సెగ్మెంట్‌లో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇందులో 184.4సీసీ ఇంజన్ కలదు. ఇది 17 బిహెచ్‌పి పవర్, 15.9 ఎన్ఎమ్ టార్క్ రిలీజ్ చేస్తుంది. బైక్ ఇంజన్ అసిస్ట్, స్లిప్పర్ క్లచ్‌తో 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది హోండా హార్నెట్ 2.0 ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.39 లక్షలు.
Bajaj Pulsar N160
బజాజ్ పల్సర్ N160 164.82cc, సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 15.7 bhp పవర్, 14.65 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మెరుగైన పవర్ డెలివరీ కోసం దీని ఇంజన్ స్మూత్-షిఫ్టింగ్ ఫైవ్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. బజాజ్ పల్సర్ N160 ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.23 లక్షల నుండి రూ. 1.40 లక్షల మధ్య ఉంటుంది.