Best Budget Cars: బడ్జెట్ ధరలో బెస్ట్ కార్లు ఇవే.. వీటికి ఏ కారు సాటిరాదంతే..!
Best Budget Cars: ప్రతి నెలలోనూ ఎన్నో కంపెనీల నుంచి రకరకాల మోడల్స్ వస్తున్నాయి. 10 లక్షల రూపాయల్లోపు బడ్జెట్‌లో లభించే టాప్ 5 కార్లు ఇవే.
Best Budget Cars: దేశంలో జనాభాతో పాటు వాహనాల సంఖ్య కూడా పెరుగుతుంది. జనాలు కూడా కార్లను కొనుగోలు చేసేందుకు ఇంటరెస్ట్ చూపుతున్నారు. డిమాండ్‌కి తగ్గట్టుగా కార్ల తయారీ కంపెనీలు కూడా వారి అభిరుచులకు అనుగుణంగా అప్‌డేటెడ్ ఫీచర్లతో అందుబాటులో ధరల్లో కొత్తకొత్త కార్లను లాంచ్ చేస్తున్నాయి. ప్రతి నెలలోనూ ఎన్నో కంపెనీల నుంచి రకరకాల మోడల్స్ వస్తున్నాయి. రానున్న రోజుల్లోనూ మరెన్నో కొత్త కార్లు మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం రూ.10 లక్షల్లోపు కొనుగోలు చేయగల 5 కాంపాక్ట్ ఎస్‌యూవీల గురించి తెలుసుకుందాం.
మారుతి సుజుకి ఫ్రాంక్స్
ఈ కారు ప్రారంభ ధర రూ.7.52 లక్షలు. 2023 ఆటో ఎక్స్‌పోలో గ్లోబల్ ప్రీమియర్‌ను ప్రదర్శించిన తర్వాత ఫ్రాంక్స్ ఏప్రిల్‌లో విడుదలైంది. పది నెలల్లోనే లక్ష యూనిట్లను విక్రయించిన అత్యంత వేగవంతమైన మోడల్‌గా నిలిచింది.
టాటా పంచ్
ఈ కారును రూ. 6.13 లక్షల ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఫ్రాంక్‌ల మాదిరిగానే పంచ్‌ను కూడా కస్టమర్లను అట్రాక్ట్ చేస్తుంది. దీనికి మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ALFA ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఈ 5 సీటర్ కారు బెస్ట్‌గా ఉంటుంది. అలానే ఇది మంచి ఇంటీరియర్ రూమ్, బూట్‌స్పేస్‌ను అందిస్తుంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ సిఎన్‌జి
హ్యుందాయ్ ఎక్స్‌టర్ సిఎన్‌జి వెర్షన్ కిలోకు 27.1 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. దీనిలో అనేక సిరీస్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఇది అనేక రకాల ఫీచర్లు, అప్‌డేట్ టెక్నాలజీని కలిగి ఉంది. మీరు దీన్ని రూ. 8.43 లక్షల ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.
హ్యుందాయ్ వెన్యూ
భారత మార్కెట్లో ఇది 1.2L NA పెట్రోల్, 1.5L డీజిల్, 1.0L టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంది. కాంపాక్ట్ SUVని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లకు ఇది బెస్ట్ ఆప్షన్. దీని ప్రారంభ ధర రూ.7.94 లక్షలు.
సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్
ఈ మిడ్ సైజ్ SUVని రెండు సీటింగ్ లేఅవుట్‌లలో కొనుగోలు చేయవచ్చు. చాలా మంది కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని దీని ధరను చాలా ఆఫర్ట్‌గా ఉంచారు. ఇది 1.2L NA పెట్రోల్, 1.2L టర్బో పెట్రోల్ ఇంజన్‌లతో అమర్చబడి, మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్‌తో లింకై ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ.9.99 లక్షలు.