Best Mileage SUV: రూ.8 లక్షల లోపు వచ్చే SUVలు ఇవే.. ధర తక్కువ బెస్ట్‌ మైలేజ్‌..!

Best Mileage SUV: కొంతమంది కొత్త సంవత్సరంలో SUV (Sport Utility Vehicle)ని కొనాలని కలలు కంటారు. అలాంటి వారికి బడ్జెట్‌లో వచ్చే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి.

Update: 2024-01-06 15:30 GMT

Best Mileage SUV: రూ.8 లక్షల లోపు వచ్చే SUVలు ఇవే.. ధర తక్కువ బెస్ట్‌ మైలేజ్‌..!

Best Mileage SUV: కొంతమంది కొత్త సంవత్సరంలో SUV (Sport Utility Vehicle)ని కొనాలని కలలు కంటారు. అలాంటి వారికి బడ్జెట్‌లో వచ్చే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. రూ.8 లక్షల లోపు సూపర్ SUV కారుని కొనుగోలు చేయవచ్చు. వాస్తవానికి SUV మాదిరి కనిపించే సబ్-కాంపాక్ట్, క్రాస్‌ఓవర్ SUVలను కొనుగోలు చేయవచ్చు. ఇవి ప్రారంభ స్థాయి హ్యాచ్‌బ్యాక్‌కు సమానమైన ధర కలిగి ఉంటాయి. అలాంటి కొన్ని SUVల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

Nissan Magnite: నిస్సాన్ మాగ్నైట్ ఒక కాంపాక్ట్ SUV. ఇది శక్తివంతమైన ఇంజిన్, ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లకు ప్రసిద్ధి చెందింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.99 లక్షలు. మాగ్నైట్ 1.0-లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో లభిస్తుంది. పెట్రోల్ ఇంజిన్‌ 71 బిహెచ్‌పి పవర్, గరిష్టంగా 96 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అయితే టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ గరిష్ట టార్క్ అవుట్‌పుట్ 152 Nm, పవర్ అవుట్‌పుట్ దాదాపు 99 హార్స్ పవర్ అందిస్తుంది.

Renault Kiger: రెనాల్ట్ కిగర్ ఒక కాంపాక్ట్ SUV. ఇది ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, ఆధునిక ఫీచర్లకు ప్రసిద్ధి చెందింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.49 లక్షలు. రెనాల్ట్ కిగర్ రెండు ఇంజిన్‌ ఆప్షన్స్‌తో వస్తుంది. 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.0లీటర్ ఎనర్జీ పెట్రోల్ ఇంజన్ కలదు. ట్రాన్స్మిషన్ ఆప్షన్స్‌లో 5 స్పీడ్ AMT, X Tronic CVT యూనిట్ ఉన్నాయి. ఈ SUV 20.62 kmpl ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది.

Tata Punch: టాటా మోటార్స్ పంచ్ అనేది బలమైన కాంపాక్ట్ SUV. ఇది శక్తివంతమైన ఫీచర్ల కారణంగా మార్కెట్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. దీనికి ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన ఇంజిన్‌ అమర్చారు. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.99 లక్షలు. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ (86 PS పవర్, 113 Nm టార్క్) ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్ ఆప్షన్‌ను కలిగి ఉంది. ఇది CNG వేరియంట్లలో కూడా లభిస్తుంది. CNGలో ఇంజిన్ 77 PS, 97 Nmను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ కారులో 7.0 అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్,సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో ఏసీ, ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, వైపర్లు ఉన్నాయి. ఇందులో క్రూయిజ్ కంట్రోల్ కూడా ఉంది.

Tags:    

Similar News