Best 7 Seater Car: సరసమైన 7 సీటర్‌ కార్లు ఇవే.. తక్కువ ధరలో బెస్ట్‌ వెహికల్స్‌..!

Best 7 Seater Car: భారతదేశంలో 7 సీటర్‌ కార్లను చాలామంది ఇష్టపడుతారు. పెద్ద కుటుంబాలకు ఇలాంటి కార్లు బాగా సెట్‌ అవుతాయి.

Update: 2024-01-07 15:30 GMT

Best 7 Seater Car: సరసమైన 7 సీటర్‌ కార్లు ఇవే.. తక్కువ ధరలో బెస్ట్‌ వెహికల్స్‌..!

Best 7 Seater Car: భారతదేశంలో 7 సీటర్‌ కార్లను చాలామంది ఇష్టపడుతారు. పెద్ద కుటుంబాలకు ఇలాంటి కార్లు బాగా సెట్‌ అవుతాయి. అందుకే 7-సీటర్ కార్లకు డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ కార్లు లాంగ్‌ జర్నీలో సౌకర్యవంతంగా ఉంటాయి. బడ్జెట్‌ ధరలో కొనుగోలు చేసే బెస్ట్‌ 7 సీటర్ కార్ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

1. మారుతి సుజుకి ఎర్టిగా

ఇది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన 7-సీటర్ కారు. ఈ కారు సరసమైన ధర, అద్భుతమైన మైలేజీకి ప్రసిద్ధి చెందింది. ఎర్టిగాలో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 105 బిహెచ్‌పి పవర్, 138 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 24.52 kmpl మైలేజీని ఇస్తుంది. ఎర్టిగా ధర రూ.8,64,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

2. రెనాల్ట్ ట్రైబర్

రెనాల్ట్ ట్రైబర్ మరొక ప్రసిద్ధ 7-సీటర్ కారు. స్టైలిష్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు, సరసమైన ధర కారణంగా ఈ కారుని చాలామంది ఇష్టపడుతున్నారు. ట్రైబర్‌లో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 72 బిహెచ్‌పి పవర్, 96 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 18.1 kmpl మైలేజీని ఇస్తుంది. ట్రైబర్ ప్రారంభ ధర రూ. 6,33,500 (ఎక్స్-షోరూమ్).

3. మహీంద్రా బొలెరోనియో

మహీంద్రా బొలెరో నియో ఒక SUV. ఇది 7-సీటర్ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ కారు ఆఫ్-రోడ్ సామర్థ్యం, సరసమైన ధరకు ప్రసిద్ధి చెందింది. బొలెరో నియోలో 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది 100 bhp శక్తిని, 260 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 17.4 kmpl మైలేజీని ఇస్తుంది. బొలెరో నియో ప్రారంభ ధర రూ. 9,64,000 (ఎక్స్-షోరూమ్).

4. మహీంద్రా స్కార్పియో ఎన్

మహీంద్రా స్కార్పియో ఎన్ ఒక గొప్ప SUV. ఈ కారు 7-సీటర్ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. ప్రజలు ఈ కారును చాలా ఇష్టపడతారు. స్కార్పియో నియోలో 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది 138 bhp శక్తిని, 300 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 14.5 kmpl మైలేజీని ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ.13,26,000 (ఎక్స్-షోరూమ్).

5. టయోటా రూమియన్

టయోటా రూమియన్ కారు అద్భుతమైన ఇంటీరియర్‌తో వస్తుంది. ఇది స్టైలిష్ డిజైన్, సరసమైన ధరతో కూడిన బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్యామిలీ కార్. రోజువారీ ఉపయోగం కోసం ఒక మంచి ఆప్షన్. ఇది సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని, భద్రతా లక్షణాలను అందిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 10,29,000 (ఎక్స్-షోరూమ్).

Tags:    

Similar News