SUV Cars: ఈ SUV కార్లు మైలేజ్‌లో నెంబర్‌ వన్‌గా నిలిచాయి.. 1 లీటర్‌కి ఎన్ని కి.మీ నడుస్తాయంటే..?

SUV Cars: ఇండియాలో SUV (స్పోర్ట్ యుటిలిటి వెహికిల్‌) కార్లకి రోజు రోజుకి డిమాండ్‌ పెరుగుతోంది.

Update: 2023-08-12 04:29 GMT

SUV Cars: ఈ SUV కార్లు మైలేజ్‌లో నెంబర్‌ వన్‌గా నిలిచాయి.. 1 లీటర్‌కి ఎన్ని కి.మీ నడుస్తాయంటే..?

SUV Cars: ఇండియాలో SUV (స్పోర్ట్ యుటిలిటి వెహికిల్‌) కార్లకి రోజు రోజుకి డిమాండ్‌ పెరుగుతోంది. సాధారణ కార్లతో పోలిస్తే వీటి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. దీనికి కారణం సీటింగ్‌ కెపాసిటి, మైలేజ్‌ పెరగడమే. అందుకే అన్ని కార్ల కంపెనీలు SUV సెగ్మెంట్‌లోకి వచ్చాయి. మీరు కొత్తగా SUVని కొనుగోలు చేయాలనుకుంటే అత్యధిక మైలేజ్‌ అందించే ఈ కార్ల గురించి తెలుసుకోవాల్సిందే.

హ్యుందాయ్ క్రెటా

హ్యుందాయ్ క్రెటా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUVలలో ఒకటి. ఇది 1.5 లీటర్, 4 -సిలిండర్ ఇంజన్ శక్తిని పొందుతుంది. ట్రాన్స్‌మిషన్ కోసం 6 స్పీడ్ మాన్యువల్ లేదా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఇది కాకుండా ఇతర ఇంజన్ ఆప్షన్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. క్రెటా ఒక లీటర్ పెట్రోల్‌కి 16.85 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.10.87 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

కియా సెల్టోస్

దక్షిణ కొరియా కార్ కంపెనీ కియా మంచి మైలేజ్ సెల్టోస్‌ని అందిస్తోంది. ఇది కొత్త 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. కియా సెల్టోస్ 17.8kmpl మైలేజీని అందిస్తుంది. ఈ SUV ఎక్స్-షోరూమ్ ధర రూ.10.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

స్కోడా కుషాక్

స్కోడా కుషాక్ చాలా సురక్షితమైన SUV కారుగా చెప్పవచ్చు. ఇది 1.5-లీటర్, 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో సహా ఇతర ఇంజన్ ఆప్షన్‌లని కూడా కలిగి ఉంది. ఐడిల్ స్టార్ట్/స్టాప్ ఫంక్షన్‌తో 17.83kmpl మైలేజీని అందిస్తుంది. స్కోడా కుషాక్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.11.59 లక్షలు.

మారుత్ సుజుకి గ్రాండ్ విటారా/టయోటా హైరిడర్

మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ SUV కూడా బలమైన హైబ్రిడ్ టెక్నాలజీతో వచ్చాయి. ఇవి 1.5 లీటర్ 4 సిలిండర్ల అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజన్ శక్తిని పొందుతాయి. ఈ రెండు SUVలు 27.97kmpl మైలేజీని అందిస్తాయి. గ్రాండ్ విటారా, హైరిడర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర వరుసగా రూ.10.70 లక్షలు అలాగే రూ.10.86 లక్షలుగా ఉన్నాయి.

Tags:    

Similar News